Sudigali Sudheer: బుల్లితెరకు సుడిగాలి సుధీర్ గుడ్ బై.. ఇక పై..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్..ఈ పేరు తెలుగునాట బాగానే పాపులర్.

Update: 2023-05-12 11:02 GMT

Sudigali Sudheer: బుల్లితెరకు సుడిగాలి సుధీర్ గుడ్ బై.. ఇక పై..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్..ఈ పేరు తెలుగునాట బాగానే పాపులర్. టీవీ షోలతో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఆ తర్వాత బిగ్ స్క్రీన్ కి ప్రమోట్ అయ్యాడు. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో అడపాదడపా చేసిన సుధీర్..హీరోగా కూడా ప్రమోషన్ కొట్టేశాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన సుధీర్ ఆ తర్వాత త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు సినిమాలు చేశాడు. ఇవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో సుధీర్ బుల్లితెరకే లిమిట్ అయితే బాగుంటుందని కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి తరుణంలోనే గాలోడు సినిమా వచ్చింది.

గాలోడు సినిమా బాక్సాఫీస్ దగ్గర దీపావళి టపాసులా పేలి ప్రొడ్యూసర్స్ కు కనకవర్షం కురిపించింది. సుడిగాడు రిజల్ట్ చూసి సుధీర్ తో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు మళ్లీ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో మిస్టర్ పర్ ఫెక్ట్ తీసిన దశరథ్...సుధీర్ కాంబినేషన్ లో సినిమా చేస్తాడని ప్రచారం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారం ఓవైపు కొనసాగుతుండగానే సుడిగాడు...తన 4వ సినిమాని ప్రారంభించేసుకున్నాడు.

విశ్వక్ సేన్ హీరోగా పాగల్ చిత్రాన్ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఎస్ఎస్4 వర్కింగ్ టైటిల్ పై సుధీర్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించుకున్నాడు. ఇందులో సుధీర్ సరసన నయా గ్లామర్ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నాడు. మొత్తానికి సుధీర్ వరస చూస్తుంటే బుల్లితెరకు మనోడు గుడ్ బై చెప్పినట్లే అంటున్నారు.


Tags:    

Similar News