Varanasi OTT Rights: మహేష్‌బాబు వారణాసికి రికార్డు బిజినెస్.. డిజిటల్ రైట్స్‌కు ఇన్ని కోట్లా?

Varanasi OTT Rights: సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది.

Update: 2025-12-08 12:30 GMT

Varanasi OTT Rights: సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పుడు దాని డిజిటల్ హక్కులపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తీవ్ర పోటీ పడుతున్నాయి. 1000 కోట్లకు పైగా ఆఫర్‌లు వస్తున్నట్టు సమాచారం. 

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఇందులో మహేష్ రుద్ర పాత్రలో కనిపించబోతుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథ విజయేంద్రప్రసాద్, స్క్రీన్‌ప్లే దేవ కట్టా, సంగీతం ఎంఎం కీరవాణి సమకూరుస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగవంతంగా సాగుతోంది.

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులపై ఫేమస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయి. హాలీవుడ్ స్థాయి డీల్ కోసం 1000 కోట్ల వరకు ఆఫర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ మొత్తం నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజిటల్ డీల్‌గా రికార్డు సృష్టించనుంది.

Tags:    

Similar News