Srivalli Pushpa Song Release: శ్రీవల్లి చూపులను వర్ణిస్తూ సిద్ నోట బోస్ పాట
* పుష్ప చిత్రం నుండి శ్రీవల్లి లిరికల్ సాంగ్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్
Srivalli Pushpa Movie Song Telugu
Srivalli Pushpa Song: ఎప్పుడెప్పుడా అంటూ శ్రీవల్లి కోసం ఎదురుచూస్తున్న "పుష్ప" అభిమానుల కోసం ఆ చిత్ర యూనిట్ శ్రీవల్లి లిరికల్ సాంగ్ ని తాజాగా విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే దాక్కో దాక్కో మేక అంటూ పులిలా వచ్చి మొదటి పాటతో మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా శ్రీవల్లి బంగారు చూపులను, మాటల మాణిక్యాలను వర్ణిస్తూ విడుదలైన ఈ మెలోడీ పాటను పుష్ప చిత్ర యూనిట్ ఉదయం 11:07 నిమిషాలకు అయిదు భాషల్లో విడుదల చేసింది. అల్లు అర్జున్ - రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా డిసెంబర్ 17న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.