Sonakshi Sinha: జటాధర నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. చంద్రముఖిలా భయపెడుతున్న సోనాక్షి సిన్హా
సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జటాధర. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటి సోనాక్షి సిన్హా నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఉమెన్స్ డే సందర్భంగా సోనాక్షి సిన్హాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్ట్‌ను విడుదల చేశారు.
జటాధర నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. చంద్రముఖిలా భయపెడుతున్న సోనాక్షి సిన్హా
Sonakshi Sinha: సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జటాధర. వెంకట్ కళ్యాణ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటి సోనాక్షి సిన్హా నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఉమెన్స్ డే సందర్భంగా సోనాక్షి సిన్హాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్ట్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో సోనాక్షి సిన్హా జుట్టు వీరబోసుకుని అచ్చం చంద్రముఖిలా కనిపిస్తోంది. నల్లని బొట్టు దాని కింద తెల్లని విభూది పెట్టుకుంది. ఫేస్ కనపడకుండా ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించేటట్టు చేతులు అడ్డంగా పెట్టుకుంది. ఆ వేళ్లకు పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయి. అంతేకాదు ఒంటినిండా బంగారంతో కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
సోనాక్షి సిన్హా తన కెరీర్‌లో తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు కమర్షియల్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన ఆమె.. ఈ సారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుంది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ జటాధర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. సినిమా ఫస్ట్ లుక్ చూస్తే.. సోనాక్షి పాత్ర పవర్‌ఫుల్ అని స్పష్టమవుతోంది. ఇక ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
బాలీవుడ్‌లో దబాంగ్ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటి నుంచి సోనాక్షి తన అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు జటాధర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది.
మౌంట్ అబూ ప్రాంతంలో మార్చి 10న మొదలయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం అంతా సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేష్ కేఆర్ భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.