Sitara Ghattamaneni: బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు గారల పట్టి సితార

Sitara Ghattamaneni: తండ్రి బాటలోనే సితార కూడా బ్రాండ్ అంబాసిడర్ గా సత్తా చాటుకుంటోంది.

Update: 2023-05-26 08:34 GMT

Sitara Ghattamaneni: బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు గారల పట్టి సితార

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. తండ్రి మహేష్ బాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సితార సొంతం చేసుకుంది. తరచూ తన డాన్స్ వీడియోలు, అందమైన ఫోటోలు షేర్ చేస్తూ భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ను సితార సంపాదించుకుంది. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమా ప్రమోషనల్ సాంగ్ లో అద్భుతంగా డాన్స్ చేసి అందర్ని ఆశ్చర్యపరచడమే కాకుండా తండ్రికి తగ్గ తనయగా క్రేజ్ కొట్టేసింది.

బ్రాండ్ అంబాసిడర్ గా సితార:

ఇక అసలు విషయం ఏంటంటే, మహేష్ బాబు ఓ వైపు సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గా కోట్లు సంపాదిస్తున్న విషయం తెలిసిందే కదా..తండ్రి బాటలోనే సితార కూడా బ్రాండ్ అంబాసిడర్ గా సత్తా చాటుకుంటోంది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ పీఎంజే తన బ్రాండ్ అంబాసిడర్ గా సితారను నియమించుకుంది. తాజాగా ఈ జ్యువెలరీ బ్రాండ్ తన ప్రమోషనల్ యాడ్ ఫోటో షూట్ ను సితారతో నిర్వహించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సితార సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ యాడ్ త్వరలోనే బయటకు రానుంది. ఈ ప్రమోషనల్ యాడ్ లో నటించినందుకు సితారకు పీఎంజే జ్యువెలరీస్ సంస్థ భారీగానే పారితోషికం అందించిందట.

మొత్తంగా, కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు, నమ్రతతో కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో నటించిన సితార ఇప్పుడు సొంతంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే యూట్యూబ్, ఇన్ స్టా ద్వారా డబ్బు సంపాదిస్తున్న సితార ఇప్పుడు నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా మారి భారీగానే సంపాదిస్తోంది. ఇది, నిజంగా ఒక రికార్డ్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ ఘట్టమనేని నట వారసురాలు ఇంకెంత సంపాదిస్తుందో చూడాలి.

Tags:    

Similar News