Shiva Rajkumar: శివరాజ్‌ కుమార్‌ క్యాన్సర్‌ను ఎలా జయించారు.? డాక్యుమెంటరీ రూపంలో..!

Shivarajkumar Beats Cancer: క్యాన్సర్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో ఇదీ ఒకటి.

Update: 2025-03-07 04:58 GMT

Shiva Rajkumar: శివరాజ్‌ కుమార్‌ క్యాన్సర్‌ను ఎలా జయించారు.? డాక్యుమెంటరీ రూపంలో..! 

Shivarajkumar Beats Cancer: క్యాన్సర్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో ఇదీ ఒకటి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే ఎంతో మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని సంతోషంగా జీవిస్తున్నారు. తమ మొక్కవోని దీక్షతో, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ క్యాన్సర్‌ను తరిమికొట్టారు. ఇలాంటి వారిలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ ఒకరు.

గత కొన్ని రోజుల క్రితం క్యాన్సర్‌ బారిన పడ్డ ఈ స్టార్‌ హీరో.. తాజాగా క్యాన్సర్‌ను జయించారు. ప్రస్తుతం శివరాజ్‌ కుమార్‌ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్యాన్సర్‌ను ఎలా జయించారన్న వివరాలను ఇతరులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన అనుభవాలను డాక్యుమెంటరీ రూపంలో తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు, దీన్ని ఎదుర్కొన్న విధానం, దృఢ సంకల్పంతో ఎలా పోరాడారనే అంశాలను ఇందులో వివరిస్తారు.

వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు, బాధితుల్లో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని చేపడుతున్నారు. అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో, అక్కడి వైద్యులు తన పోరాటాన్ని డాక్యుమెంటరీ రూపంలో చూపితే మరెందరికైనా స్ఫూర్తినిస్తుందని సూచించారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ వార్తతో అభిమానులు సోషల్ మీడియాలో శివన్నకు మద్దతు తెలుపుతూ, మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.

సామాజిక సేవలో రాజ్‌కుమార్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని తెలిసిందే. అనాథ పిల్లలు, వృద్ధులు, విద్యార్థులకు సహాయపడటంలో వారు క్రియాశీలంగా ఉంటారు. ముఖ్యంగా, పునీత్ రాజ్‌కుమార్ సేవా కార్యక్రమాల్లో మరింత ముందుండేవారు. మరి ఈ డాక్యుమెంటరీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో చూడాలి. 

Tags:    

Similar News