Shahid Kapoor Jersey : అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ .. రెమ్యునరేషన్ మాములుగా పెంచలేదు

Shahid Kapoor Jersey : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2020-09-24 12:34 GMT

shahid kapoor

Shahid Kapoor Jersey : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాతో విజయ్ ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. అయితే ఇదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో షాహిద్ కపూర్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా రూ.380 కోట్ల వసూళ్లు రాబట్టింది. విజయ్ లాగే షాహిద్ కపూర్ కూడా అక్కడ స్టార్ హీరో అయిపోయాడు.

అయితే ఈ సినిమా తర్వాత షాహిద్ కపూర్ తన పారితోషికంను డబుల్ చేశాడంటూ బాలీవుడ్ వర్గాలలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ టాలీవుడ్ లో మంచి హిట్ అయిన జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ రీమేక్ కు గాను షాహిద్ కపూర్ రూ.35 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట.. అంతేకాకుండా సినిమాల్లో 15 కోట్ల వరకు లాభాలు తీసుకునే అవకాశం కూడా ఉందట.. అయితే సుమారుగా ఈ సినిమాని 150 కోట్ల టార్గెట్ తో నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అరవింద్.. దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక తెలుగులో జెర్సీ సినిమాని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని కూడా తెరకేక్కిస్తున్నాడు. ఇందులో మృణాల ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ ఇందులో సత్యరాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కబీర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. 

Tags:    

Similar News