'సరిలేరు నీకెవ్వరు' ఓవర్సీస్‌ వసూళ్లు.. నెవ్వర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా దద్దరిల్లుతుంది.

Update: 2020-01-11 14:49 GMT
SarileruNeekkevvaru

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి, సందేశాత్మక చిత్రాలు చేస్తున్న మహేష్ చాలా కాలం తర్వాత కమర్షియల్ మూవీ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా దద్దరిల్లుతుంది. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన షోలను ప్రదర్శించారు. అక్కడ మొదటి రోజు కలెక్షన్ రిపోర్టు కూడా వచ్చింది.

ఈ సినిమా ఓవరిస్సిస్ లో తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమా దాదాపు 252 ప్రదేశాల్లో విడుదలైంది.  అమెరికాలో తొలిరోజు అత్యధికంగా 750కే డాలర్ల(రూ.5,32,43,250) కలెక్షన్లు రాబట్టిన చిత్రం కూడా ఇదే. ఇక తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్ 15లో చోటు దక్కించుకుంది. నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు కలెక్షన్లలో దూసుకుపోతుంది. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన మహేష్ ఈ సారి సరిలేరు నీకెవ్వరుతో మరోసారి రికార్డులు సృష్టించనున్నాడు. సంక్రాంతి సెలవులతో థియేటర్లు కాసులతో కళకళాడుతున్నాయి.

మరోవైపు  సరిలేరు నీకెవ్వరు ట్విట్టర్‌లో అయితే మోత మోగిపోతోంది. ట్విట్టర్‌లో ఇండియాలో సరిలేరు నీకెవ్వరు టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్‌లో మొదటి మూడు స్థానాలకు ఆక్రమించింది. #SarileruNeekkevvaru టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది. #BlockBusterSarileruNeekevvaru రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో #MindBlock హ్యాష్ ట్యాగ్ ఉంది. #AVPLFromTomorrow టాప్ 5 ట్రెండింగ్‌లో ఉంది. టాప్ 5 ట్రెండింగ్ నాలుగు టాలీవుడ్‌ సినిమాలకు చెందినవి కావడం గమనార్హం.

రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో మహేష్ బాబు నిర్మించాడు. సంక్రాంతి కానుకగా ఈ రోజు భారీ అంచనాల నడుమ రిలిజైంది ఈ సినిమా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో విజయశాంతి ప్రకాష్ రాజ్, సంగీత, హరితేజా, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, రఘు బాబు తదితరులు నటించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం 7 గంటలకే షోలు మొదలయ్యాయి. అన్ని ధియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఆర్మీ లుక్ లో మహేష్ నటన, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం, అనిల్ రావిపూడి కామెడీ, దేవి నేపధ్య సంగీతం ఇలా అన్ని బాగా వర్కౌట్ కావడంతో ఫ్యాన్స్ పండగ ముందే వచ్చిందని అంటున్నారు. పొంగల్ కి పర్ఫెక్ట్ మూవీ అని అంటున్నారు. ఇక డై హార్డ్ ఫ్యాన్స్ అయితే " నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్ " అని కామెంట్స్ పెడుతున్నారు.


Tags:    

Similar News