Sandeep Reddy Vanga: అలా కూడా సినిమా తీసి చూపిస్తా.. మరోసారి సందీప్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Sandeep Reddy Vanga: సందీప్‌ వంగా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Update: 2025-03-04 05:24 GMT

Sandeep Reddy Vanga: సందీప్‌ వంగా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన ఫిల్మ్‌ మేకింగ్‌తో ఇండస్ట్రీని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. యానిమల్‌ మూవీతో దేశం మొత్తాన్ని ఆకర్షించాడీ యంగ్‌ డైరెక్టర్‌. అయితే సినిమాలతో పాటు కాంట్రవర్సీలతో కూడా నిత్యం సావాసం చేస్తుంటారు సందీప్‌. మొన్నటికి మొన్న ఓ ఇంటర్వ్యూలో ఐఏఎస్‌ కావడం కంటే సినిమా తీయడమే కష్టం అంటూ ఓ మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్‌పై తనదైన శైలిలో సెటైర్‌ వేసిన సందీప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కామెంట్‌ చేశారు.

సందీప్‌ రెడ్డి సినిమాల్లో హీరోలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిజానికి సరికొత్త అర్థం చెప్పాడు సందీప్‌. ఈ క్రమంలోనే ‘యానిమల్‌’లో మహిళా పాత్రల్ని తగ్గించి చూపించారని కొందరు విమర్శించారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో సందీప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడారు. అందులో భాగంగా ‘‘పాటలు లేకుండా సినిమా తీయాలా? లేక హీరో లేకుండా?’’ అనే ప్రశ్న ఎదురైంది.

దానికి స్పందిస్తూ, ‘‘హీరో లేకుండా సినిమా తీయాలనుకుంటున్నాను. అలాంటి సినిమా తీసినా, నన్ను విమర్శించిన మహిళలు దాన్ని ఇష్టపడరని చెప్పగలను. 4-5 సంవత్సరాల్లో అలాంటి ప్రాజెక్ట్‌ చేస్తాను. అప్పటికి అందరూ ‘అప్పట్లో చెప్పినట్లే చేసి చూపించాడు’ అంటారు’’ అన్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ‘స్పిరిట్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర బాక్సాఫీస్‌ రికార్డుల గురించి మాట్లాడుతూ, బాహుబలిని దాటాలనే ఆశ లేదని, రూ.2000 కోట్లు భారీ లెక్క అని అన్నారు. మంచి సినిమా కావడం ముఖ్యం, వసూళ్లు ప్రేక్షకుల నిర్ణయమన్నారు.

Tags:    

Similar News