విజయ్ దేవరకొండ కోసం షూటింగ్ మొదలు పెట్టనున్న సమంత

* విజయ్ దేవరకొండ కోసం షూటింగ్ మొదలు పెట్టనున్న సమంత

Update: 2023-03-03 16:00 GMT

విజయ్ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన సమంత

Kushi Movie: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఆశలన్నీ తనకు తదుపరి సినిమా పైన పెట్టుకున్నాడు. "నిన్ను కోరి", "మజిలీ" వంటి సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా "ఖుషి". స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తయింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంది.

అయితే సినిమా షూటింగ్ విషయంలో మాత్రం చిత్ర బృందం బోలెడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొన్నాళ్లపాటు సినిమాలకి దూరమైంది. దీంతో తన సినిమా షూటింగులన్నీటికీ బ్రేకులు పడిపోయాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ సమంత షూటింగ్ లు మొదలుపెట్టింది. బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత మార్చి 8 నుంచి విజయ్ దేవరకొండ "ఖుషి" సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేసి జూన్లోనే ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇన్ని రోజులపాటు సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు సమంత కోలుకోవడంతో మళ్ళీ ట్రాక్ లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది, విజయ్ మరియు సమంతాల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News