Samantha: ఆ సినిమాలు చేయకుండా ఉండాల్సింది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. హీరోలతో సమానమైన క్రేజ్‌ దక్కించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు.

Update: 2025-03-06 04:42 GMT

Samantha: ఆ సినిమాలు చేయకుండా ఉండాల్సింది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. హీరోలతో సమానమైన క్రేజ్‌ దక్కించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు, ఆరోగ్యపరమైన ఇబ్బందుల కారణంగా సామ్‌ ఇటీవల సినిమాల్లో కాస్త వెనుకబడింది. అయితే మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లోకి వచ్చిందీ బ్యూటీ. తాజాగా వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉంటే సమంత ఇండస్ట్రీకి పరిచయమై సుమారు 15 ఏళ్లు గడుస్తోంది. 2010లో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది. అయితే తాజాగా సమంత తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్‌ తొలినాళ్లలో కొన్ని పాత్రలు చేయకుండా ఉండాల్సింది అంటూ ఓపెన్‌ అయ్యింది.

ఈ విషయమై సమంత మాట్లాడుతూ.. 'సినిమా రంగంలో నటిగా ప్రయాణం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ప్రతి విజయం నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో సినిమాల ఫలితాల గురించి టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు నాకు స్పష్టత వచ్చింది. కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలు ఇప్పుడు చూసినప్పుడు విచిత్రంగా అనిపిస్తున్నాయి. అవి చేయాల్సింది కాదని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చింది.

కాగా మయోసైటిస్‌ బారిన పడిన తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ 2023లో శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మరో పూర్తి స్థాయిలో సినిమాలో కనిపించలేదీ బ్యూటీ. అయితే ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ‘రక్తబ్రహ్మండ: ది బ్లడీ కింగ్‌డమ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

Tags:    

Similar News