విజయ్ దేవరకొండ కోసం ఖుషి గా మారనున్న సమంత

Kushi Movie: విజయ్ సమంత సినిమా టైటిల్ వెనుక కారణం ఇదేనా?

Update: 2022-06-09 08:00 GMT

విజయ్ దేవరకొండ కోసం ఖుషి గా మారనున్న సమంత

Kushi Movie: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తూ ఖుషి సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా తర్వాత మళ్లీ సమంత మరియు విజయ్ దేవరకొండ ఈ సినిమా తో జత కట్టనున్నారు. ఈ రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ టైటిల్ తో ఏమాత్రం సంతోషంగా లేరు.

అయినా సరే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శివ నిర్వాణ గతంలో తన "నిన్ను కోరి", "మజిలి" వంటి సినిమాలతో మెప్పించడం తో ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత పాత్ర పేరు ఖుషి. అందుకే సినిమాకి కూడా అదే టైటిల్ ను ఖరారు చేసారు. నిజానికి 2001లో పవన్ కళ్యాణ్ మరియు భూమిక నటించిన "ఖుషి" సినిమాలో భూమిక పాత్ర పేరు "ఖుషి" కాదు.

అయితే ఈ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన హిందీ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అందులో ఆమె పాత్ర పేరు ఖుషి సింగ్. మరి ఇప్పుడు ఖుషి పాత్రలో సమంత ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News