Retro Movie OTT Version: ల్యాగ్ ఉన్న సినిమాకి ఇంకో 40 నిమిషాలు యాడ్ చేయనున్న దర్శకుడు!
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన "రెట్రో" సినిమా పై మరోసారి చర్చ మొదలైంది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమా సాధారణ కథా రూపకల్పనతో పాటు నెమ్మదిగా సాగుతూ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది
Retro Movie OTT Version: ల్యాగ్ ఉన్న సినిమాకి ఇంకో 40 నిమిషాలు యాడ్ చేయనున్న దర్శకుడు!
Retro Movie OTT Version: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన "రెట్రో" సినిమా పై మరోసారి చర్చ మొదలైంది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమా సాధారణ కథా రూపకల్పనతో పాటు నెమ్మదిగా సాగుతూ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సినిమా నిడివి, ల్యాగ్ తాలూకు విమర్శలు అప్పట్లో ప్రేక్షకుల నుంచి ఎక్కువగానే వచ్చాయి. తెలుగు ప్రేక్షకుల్లో అయితే ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయితే, మేకర్స్ మాత్రం సినిమా 200 కోట్ల క్లబ్ లోకి వెళ్లిందంటూ ప్రమోషన్లలో చెప్పుకోవడం చూసాం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రెట్రో" సినిమా ఎడిటింగ్ సమయంలో తొలగించిన మరో 40 నిమిషాల ఫుటేజ్ ఉందని, దానిని కలిపి ఓటీటీలో ఫుల్ వర్షన్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు అదనపు సన్నివేశాలు జోడించిన వెర్షన్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కార్తీక్ తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంగీకరిస్తే, పూర్తిస్థాయి వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేశారు.
అయితే ఈ ప్రకటనపై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. “థియేటర్స్‌లోనే సినిమానే చాలా ల్యాగ్‌గా ఉంది.. దానికి ఇంకా 40 నిమిషాలు ఎందుకు యాడ్ చేస్తున్నారు?” అని ట్రోల్స్ చేస్తున్నారు. "ల్యాగ్ తగ్గించే బదులు ఇంకెంతో పెంచాలనుకుంటున్నారా?" అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మరి నిజంగా "రెట్రో" ఫుల్ వెర్షన్ ఓటీటీలో వెలుగు చూస్తుందా? లేదంటే ఇది కేవలం మరో ప్రచార యత్నమా? వేచి చూడాలి!