ప్రభాస్‌, చిరు సినిమాలకు హైకోర్టులో ఊరట

సంక్రాంతి బరిలో నిలుస్తున్న భారీ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది.

Update: 2026-01-07 07:39 GMT

సంక్రాంతి బరిలో నిలుస్తున్న భారీ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ బెనిఫిట్ షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ప్రతికూల తీర్పును ధర్మాసనం సవరించింది.

గతంలో టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కోర్టు ఇప్పుడు కేవలం ఆరు చిత్రాలకు మాత్రమే పరిమితం చేసింది. ఆ సినిమాలు పుష్ప-2, ఓజీ (OG), గేమ్ ఛేంజర్, అఖండ-2.

దీంతో ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్‌’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రాలకు ఆ నిబంధనలు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఈ చిత్రాల నిర్మాతలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్ ధరలను పెంచుకోవడానికి, అలాగే ప్రత్యేక షోలను ప్రదర్శించుకోవడానికి అవకాశం లభించినట్లయింది.

భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేటప్పుడు పెట్టుబడి రికవరీ కోసం టికెట్ ధరల పెంపు మరియు అదనపు షోలు తప్పనిసరి అని నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వం అనుమతి ఇస్తే అడ్డుకోవద్దని కోరారు. హైకోర్టు తాజా తీర్పుతో సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించే అవకాశం ఏర్పడింది.

Tags:    

Similar News