Pawan Kalyan: పవన్ 'బాలు' సినిమాలో నటించాల్సిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక టాప్ హీరోకి భార్య!
Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘తొలి ప్రేమ’ తర్వాత పవన్ కల్యాణ్ - కరుణాకరన్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ‘బాలు’.
Pawan Kalyan: పవన్ 'బాలు' సినిమాలో నటించాల్సిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక టాప్ హీరోకి భార్య!
Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘తొలి ప్రేమ’ తర్వాత పవన్ కల్యాణ్ - కరుణాకరన్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ‘బాలు’. 2005 జనవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, పవన్ కల్యాణ్ ‘కార్గో ప్యాంట్స్’ ట్రెండ్‌తో అప్పట్లో యూత్‌ను ఊపేసింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఒక కీలక మార్పు జరిగిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మొదటి ఛాయిస్ ఆమె కాదు!
బాలు సినిమాలో పవన్ సరసన నటించిన శ్రియ శరణ్ పాత్రకు మొదట బాలీవుడ్ భామ, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ను అనుకున్నారట. అప్పట్లో నమ్రతకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత అశ్వినీదత్ ఆమెతో ఒప్పందం (Agreement) కూడా చేసుకున్నారట. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఆ అవకాశం శ్రియను వరించింది. ఒకవేళ నమ్రత నటించి ఉంటే.. పవన్-నమ్రత క్రేజీ కాంబినేషన్‌ను మనం వెండితెరపై చూసేవాళ్లం.
పాన్ ఇండియా స్టార్ల ‘బాల్యం’:
ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో భారీ తారగణం ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వెలుగొందుతున్న తేజ సజ్జా (హనుమాన్ ఫేమ్) మరియు ‘బలగం’ హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ ఇద్దరూ ఇందులో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. జయసుధ, సునీల్, బ్రహ్మానందం వంటి ఉద్దండులు ఈ సినిమాలో భాగమయ్యారు.
మెగాస్టార్‌తో నటించి.. సూపర్ స్టార్‌తో ప్రేమలో పడి..
నమ్రతా శిరోద్కర్ మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘వంశీ’ సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడటం, అనంతరం వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె నటనకు స్వస్తి పలికారు.