Jigris Movie: అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్‌లో దుమ్మురేపుతున్న జిగ్రీస్..!
Jigris Movie: ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మరియు సన్ నెక్స్ట్ (SunNXT) ప్లాట్‌ఫామ్స్‌లో ఒక చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Jigris Movie: ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మరియు సన్ నెక్స్ట్ (SunNXT) ప్లాట్‌ఫామ్స్‌లో ఒక చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదే ‘జిగ్రీస్’. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పై ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.
దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం మొత్తం కలిసి ఆనందించేలా ఈ కథను అద్భుతంగా మలిచారు. ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా ఆయన కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయం. హీరో కృష్ణ బురుగుల తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రాణం పోశారు.
సయ్యద్ కమ్రాన్ అందించిన మ్యూజిక్, ఈశ్వరదిత్య డీవోపీ మరియు చాణక్య రెడ్డి ఎడిటింగ్ సినిమాను టెక్నికల్‌గా మరో మెట్టు ఎక్కించాయి. కృష్ణ వోడపల్లి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సపోర్ట్ తోడవ్వడం సినిమాకు పెద్ద బలాన్ని ఇచ్చింది.
కేవలం కామెడీ మాత్రమే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలను ఇష్టపడే వారికి ‘జిగ్రీస్’ ఒక మంచి ఛాయిస్. ఈ వీకెండ్‌లో మీ ఫ్యామిలీతో కలిసి ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌ని అస్సలు మిస్ అవ్వకండి.