Ravi Teja: హిట్స్‌ లేకపోయినా తగ్గేదేలే.. రూటు మార్చిన మాస్‌ మహారాజా

Ravi Teja: రవితేజ గత కొంత కాలంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. వరుస సినిమాలు పరాజయం అవుతున్నాయి. క్రాక్‌, ధమాకా తర్వాత మళ్లీ రవితేజ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు.

Update: 2025-03-01 04:54 GMT

Ravi Teja: హిట్స్‌ లేకపోయినా తగ్గేదేలే.. రూటు మార్చిన మాస్‌ మహారాజా

Ravi Teja: రవితేజ గత కొంత కాలంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. వరుస సినిమాలు పరాజయం అవుతున్నాయి. క్రాక్‌, ధమాకా తర్వాత మళ్లీ రవితేజ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే రవితేజ వరుసగా సినిమాలు చేయడం కంటే, అభిమానులు మాస్ హిట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విషయం మాస్ రాజాకు ఇప్పుడు అర్థమైనట్లుంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు గానీ, కథల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్‌ దర్శకులను లైన్‌లో పెట్టారు. ఆయన తదుపరి సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మాస్‌ మహారాజా రవితేజకు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. సరైన సినిమా పడితే బాక్సాఫీస్‌ షేక్‌ కావడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటికి నిదర్శనమే క్రాక్, ధమాకా సినిమాలు.

కానీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో రవితేజ గ్యాప్‌ తీసుకోవడం అనివార్యమైంది. ప్రస్తుతం భాను భోగవరపుతో మాస్ జాతర సినిమా చేస్తున్నారు. ఇది ఆయనకు 75వ చిత్రం. అందుకే గ్యాప్ తీసుకున్నా, పక్కా హిట్‌ మెటీరియల్‌తో రావాలని ప్లాన్‌ చేస్తున్నారు.

మాస్ జాతర తర్వాత చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్నారు. ట్రాక్ రికార్డ్‌ను పక్కన పెట్టి, టాలెంటెడ్‌ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో అనార్కలి సినిమాకు ఓకే చెప్పారు. మాస్ జాతర తర్వాత వెంటనే సెట్స్‌పైకి వెళ్లే ప్రాజెక్ట్ ఇదే. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్‌ శంకర్‌తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిషోర్‌ తిరుమల చిత్రం తర్వాత ఇది ప్రారంభం కానుంది. ప్రస్తుతం కళ్యాణ్‌ శంకర్ మ్యాడ్ స్క్వేర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. దీని తర్వాత రవితేజ ప్రాజెక్ట్‌పై కళ్యాణ్ శంకర్‌ ఫోకస్‌ పెడతారు. మరి రూటు మార్చిన రవితేజ కుర్ర హీరోలకు ఏమేర పోటినిస్తారో చూడాలి.

Tags:    

Similar News