Rashmika Mandanna: పూజా దారిలో వెళ్లి తప్పు చేస్తున్న రష్మిక మందన్న
Rashmika Mandanna: పూజా హెగ్డే పవన్, మహేశ్ మూవీలను వదులుకుని అడ్రస్ గల్లంతు చేసుకుంది.
Rashmika Mandanna: పూజా దారిలో వెళ్లి తప్పు చేస్తున్న రష్మిక మందన్న
Rashmika Mandanna: పూజా హెగ్డే పవన్, మహేశ్ మూవీలను వదులుకుని అడ్రస్ గల్లంతు చేసుకుంది. ఇప్పుడు రష్మికా కూడా అలాంటి తప్పే చేస్తోందా? నితిన్ మూవీ నుంచి తను జంప్ అంటున్నారు. అవన్నీ రూమర్స్ అనేలా రష్మిక ఫోటో పోస్ట్ చేసింది. కాని, సీన్ చూస్తే రష్మికకు కూడా పూజాకి ఎదురైన పరిస్థితే వచ్చేలా ఉందట... నిజమేనా?
పూజా హెగ్డే దూసుకెళుతున్న టైంలో ప్లాపులు డీలాపడేలా చేశాయి. తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ని డేట్ల కారంణంతో వదులుకుంది. గుంటూరు కారం నుంచి తను బయటికి వచ్చేసింది. ఆ తర్వాతే తన తలరాత తారుమారైంది. ఆఫర్లు లేక డీలా పడాల్సి వచ్చింది. కాల్ షీట్లు లేవని కాలర్ ఎగరేస్తే, అది పెద్ద హీరోల సినిమాలను వదులుకుంటే ఎలా ఉంటుందో పూజా పరిస్థితి చూస్తేనే అర్ధమైపోతుందంటున్నారు. అచ్చంగా అలాంటి సీనే రష్మికకు రిపీట్ అయ్యేలా ఉందనేస్తున్నారు.
రష్మిక కూడా పూజా దారిలోనే నడుస్తూ, వెంకీ కుడుములు, నితిన్ మూవీ నుంచి తప్పుకుందంటున్నారు. యానిమల్ తాలూకు పాటల షూటింగ్ డిలే అవటంతో తన డేట్స్ క్లాష్ అయ్యాయట. అందుకే వెంకీ, నితిన్ తో కాంబినేషన్ రిపీట్ చేసే ఛాన్స్ ని వదులుకుందని ప్రచారం పెంచారు. రష్మిక చేతిలో పుష్ప 2, యానిమల్ ఉంది. ఈ రెండు సినిమాల్ల ఒకటి పూర్తవుతోంది. మరొకటి పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. సో ఈ రెండూ అయిపోతున్న వేల చేతిలో ఉన్న ఆఫర్ ని వదులుకుంటే, పూజా హెగ్డేలా ఖాలీగా ఉండాల్సి వస్తుందంటున్నారు. పుష్ప, యానిమల్ ఏది వర్కవుట్ కాకున్నా మళ్లీ చిన్న హీరోలతో జోడీకట్టక తప్పదు కాబట్టే, ఉన్న ఆఫర్ ని వదులుకోవటం తప్పనేస్తున్నారు.
ఏదేమైనా నితిన్ మూవీని రష్మిక వదులుకుందన్న వార్తల్ని చిన్న ఫోటో పోస్ట్ చేసి ఇంకా కన్ ఫ్యూజన్ లో పడేసింది రష్మిక. ఏదేమైనా ప్రభాస్ తో సందీప్ తీయబోయే స్పిరిట్ లో రష్మిక రోల్ కన్ఫామ్ అన్నారు. సో ఆ హోప్ తో చేతిలో ఉన్న చిన్నీ చితకా ఆఫర్స్ ని వదులుకుంటే, కాల్ షీట్లు ఖాలీగా కరిగిపోవాల్సి వస్తుందనే కామెంట్లు పెరిగాయి.