Rang De Team Surprise To Nithiin: నితిన్ మ్యారేజ్ : రంగ్ దే టీం స్పెషల్ గిఫ్ట్

Rang De Team Surprise To Nithiin: మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రియురాలు

Update: 2020-07-26 06:59 GMT
Nithin - shalini

Rang De Team Surprise To Nithiin: మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రియురాలు కందుకూరి షాలిని మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు నితిన్.. హైదరాబాదులోని తాజ్ ఫలక్ నుమా హోటల్ లో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు నితిన్ - షాలినీ ఒకటి కాబోతుంది. ఇప్పటికే ఈ వేడుకకి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కేవలం అతి కొద్ది మంది సమక్షంలోనే నితిన్ పెళ్లి జరగనుంది. ఇక ఇప్పటికే జరిగిన మెహందీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నితిన్ - షాలినిల వివాహం సందర్భంగా రంగ్ దే టీం నితిన్ ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దం అయింది. జూలై 26న 4 గంటల 05 నిమిషాలకు నితిన్ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని ఆఫీషియల్ అనౌన్స్ కూడా ఇచ్చేసింది. దీనితో అభిమానుల్లో ఆతృత మొదలైంది. అయితే ఆ గిఫ్ట్ ఏంటి అన్నది మాత్రం సస్పెన్సులోనే ఉంచారు మేకర్స్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో నితిన్ సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ కి ఇది 29 వ చిత్రం కావడం విశేషం.. తాజాగా ఈ ఏడాది భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి.



ఇక ఈ సినిమాతో పాటుగా గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.

Tags:    

Similar News