Aranya Movie: రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే!

Aranya Movie: ప్రతీ సినిమాకు కొత్తదనం చూపించే నటుడు రానా దగ్గుబాటి.

Update: 2021-03-28 10:32 GMT

అరణ్య మూవీ ఫైల్ ఫోటో 

Aranya Movie: ప్రతీ సినిమాకు కొత్తదనం చూపించే నటుడు రానా దగ్గుబాటి. విలక్షణ పాత్రలు ఎంచుకొంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఈసారి ఓ సరికొత్త పాత్రలో కనిపించాడు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అరణ్య'. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుదలైంది. మనుషుల దురాశ, ఏనుగుల అవసరాలకు మధ్య జరిగే పోరాటాలా నేపథ్యంలో అరణ్య సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రానా ఏనుగులను రక్షించే ఓ మావటివాడిగా కనిపించాడు.

విష్ణు విశాల్,అనంత్ మహదేవన్,శ్రియా పిల్గోంకర్,జోయా హుస్సేన్,రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కొద్దిగా నిరాశ పరిచగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హోల్డ్ ని చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సినిమాపై ఆడియోన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కాగా.. రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత డ్రాప్స్ ని సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ చేతులు ఎత్తేసింది.

మొత్తం మీద రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 67 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా, తమిళ్ డబ్ వర్ష మొత్తం మీద 2 రోజుల్లో 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలో కలిపి రిలీజ్ అవ్వగా హిందీ వర్షన్ తర్వాత రిలీజ్ కానుంది. సినిమా బడ్జెట్ 60 కోట్లు కాగా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 45 కోట్లు రికవరీ అవ్వగా.. మిగిలిన 15 కోట్లు సినిమా బిజినెస్ గా మారి 15.5 కోట్ల టార్గెట్ బరిలోకి దిగింది. ఈ  సినిమా బిజినెస్ పరంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 12.41 కోట్ల షేర్ సాధించాలి.

*నిజాం: 70L

*సీడెడ్: 29L

*యూఏ: 30L

*ఈస్ట్: 15L

*వెస్ట్: 13L

*గుంటూరు: 27L

*కృష్ణజిల్లా: 13L

*నెల్లూరు: 8L

*ఏపీ తెలంగాణ మొత్తం:- 2.05CR (3.15Cr Gross~)

*కర్ణాటక: 90L

*ఓవర్సీస్: 14L

*ప్రపంచవ్యాప్తంగా: 3.09CR( 5.20CR~ Gross)

Tags:    

Similar News