RGV on Chandrababu: చంద్రబాబుపై పాట.. సోషల్ మీడియాలో వైరల్..
Chandrababu: ఏపీ మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పగబట్టినట్టున్నారు.
RGV on Chandrababu: చంద్రబాబుపై పాట.. సోషల్ మీడియాలో వైరల్..
Chandrababu: ఏపీ మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పగబట్టినట్టున్నారు. టీడీపీకి రాజకీయ ప్రత్యర్థుల కంటే కూడా రాంగోపాల్ వర్మనే ప్రధాన ప్రత్యర్థి అనే రేంజ్ లో సినిమాలతో, వివాదాస్పద ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. గతంలో రక్తచరిత్ర, వంగవీటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు తీసి వివాదాలు రేపారు. అంతటితో ఆగకుండా గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించి రాజకీయ చిచ్చును రగిలించారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ వర్మ విమర్శలు చేశారు. సినిమాలు కూడా తీశారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ని ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు పెట్టిన మీటింగ్గులపై కూడా వర్మ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి జనాల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆరోపించారు. తన కోసం ఎంతమంది చనిపోతే అంత పాపులారిటీ ఉన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారని ఆర్జీవీ ట్వీట్ల యుద్ధం చేశారు. చంద్రబాబును హిట్లర్ తో పోల్చారు.
జనసేన అధినేత పవన కల్యాణ్, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు భేటీని సైతం ఆర్జీవీ వదల్లేదు. RIP కాపులు కంగ్రాట్స్ కమ్మవాళ్లు అంటూ ఆర్టీవీ చేసిన ట్వీట్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై విషం కక్కుతున్న రాంగోపాల్ వర్మ తాజాగా మరోసారి బుసకొట్టారు. చంద్రబాబు పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూనే సిక్కో సైకో సాంగ్ ని ఆర్జీవీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.