Ram Charan - RRR Movie: కొమరం భీమ్ పాత్ర గురించి చెప్తున్న రామ్ చరణ్

Update: 2021-08-23 10:22 GMT

రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటో)

Ram Charan - RRR Movie: తెలుగులో స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా "ఆర్ఆర్ఆర్". జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియన్ చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఒకవేళ నిజంగా అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ కలిసి ఉంటే ఏం జరిగి ఉండొచ్చు అనే ఒక ఫిక్షనల్ కథే ఈ సినిమా.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఎన్టీఆర్ మరోవైపు బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్నారు. "ఎవరు కోటీశ్వరులు" అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఎన్టీఆర్. ఈ షో ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నిన్న అనగా ఆగస్టు 22న ఈ షో కి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది. దీనిలో భాగంగా రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కొమరం భీమ్ పాత్ర నుంచి ప్రేక్షకులకు చాలా సర్ప్రైజ్ లు ఉంటాయని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News