హ్యపీ బర్త్‌డే డార్లింగ్ నవిష్క : ఉపాసన
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజా- కళ్యాణ్ దేవ్‌ల దంపతుల కుమార్తె నవిష్క జన్మదిన వేడుకలు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజా- కళ్యాణ్ దేవ్‌ల దంపతుల కుమార్తె నవిష్క జన్మదిన వేడుకలు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. గురువారం రోజు క్రిస్మస్ కావడంతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొని ఉంది. ఈ పుట్టిన రోజు వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో ఈ ఫంక్షన్ లో కలిపించారు. ఈ సందర్భంగా శ్రీజా- కళ్యాణ్ దేవ్‌ల కూమార్తెతో దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల జోడిస్తూ ఓ క్యాప్షన్ పెట్టారు. అత్తమామల ప్రేమతో హ్యపీ బర్త్‌డే డార్లింగ్ నవిష్క అంటూ క్యాప్షన్ పెట్టారు. అంతే కాకుండా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ పోస్టు చేశారు. నవిష్క తండ్రి హీరో కళ్యాణ్ దేవ్ కూడా భావోద్వేగ ట్వీట్ చేశారు. నీ పుట్టి సంవత్సరం ఇంత త్వరగా గడుస్తుందని నమ్మలేకున్నాను. నీ మొదట ఏడ్చిన క్షణాలు, నీ నవ్వులు నాకు గుర్తుంటాయి అని భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌కు జోడీగా అలియా భట్, జూ. ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ నటి మోరిన్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2020 జూలై 31న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం కీరవాణి అందిచ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెలుగు చిత్రసీమకు పరిచయమైయ్యారు. విజేతగా సినిమాతో హీరోగా వచ్చిన కళ్యాణ్ తన నటనతో సినీ ప్రేక్షకులను మెప్పించారు.