బాక్సాఫీస్‌ వద్ద రజనీ 'దర్బార్‌' కలెక్షన్ల సునామీ..

సౌత్ ఇండియాన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ బాక్సాఫీస్ మీద దండయాత్ర మొదలు పెట్టారు.

Update: 2020-01-11 12:45 GMT

సౌత్ ఇండియాన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ బాక్సాఫీస్ మీద దండయాత్ర మొదలు పెట్టారు. సంక్రాంతి కానుకగా గురువారం విడుదలైన దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజనీ. ఇప్పటికే సినిమా ప్రపంచవ్యాప్తంగా తోలి ఆట నుంచి మంచి టాక్ రావడంతో రజనీకాంత్ మళ్లి తన స్టామినా చూపించారు. పాజిటివ్‌ టాక్‌ రావడంతో అభిమానులు ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అంటూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిచాడు రజినీ.. ముంబై బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార నివేద థామస్,యోగిబాబు సునీల్ శెట్టి ముఖ్యపాత్రలు పోషించారు.

ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలైన 'దర్బార్' చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. అంతేకాకుండా కలెక్షన్లు కుల్లగొట్టడంలో పరంగా బాక్సాఫీస్‌ వద్ద జోరు చూపిస్తుంది. భారీ అంచానలతో విడుదలై ఈ సినిమాకు మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్లపైగా వసూలు చేసింది. కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలోనే దాదాపు రూ. 19 కోట్ల రాబట్టిందటే రజనీ స్టామినా ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. కోలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం రోబో తర్వాత ఇది రెండో సారి.

బాలీవుడ్‌, ఓవర్సీస్‌లోనూ రజనీ కాంత్ కు మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా రజనీకి అభిమానులు ఉన్నారు. దీంతో అక్కడ కూడా 'దర్బార్‌' సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 'దర్బార్‌' రూ. 50 కోట్ల మేర వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించింది. బాలీవుడ్‌లో తానాజీ, ఛపాక్‌ చిత్రాలు విడుదలైనప్పటికీ 'దర్బార్‌'జోరు, హుషారు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ లో హిందీ చిత్రాలకు ధీటుగా కలెక్షన్లు రాబట్టింది.

అదేవిధంగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వచ్చే వరకు తెలుగులో మరే ఇతర సినిమా లేకపోవడం రజనీ దర్బార్‌కు మరింత కలిసొచ్చింది. గురువారం, శుక్రవారం కూడా దాదాపు రూ. 50 కోట్ల వసూళ్లు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్‌గా రజనీ దర్బార్‌ సినిమా విడుదలైన 2 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ దాటిందని ట్రెడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. హిట్ చిత్రం కావడంతో పండగ సెలవులు ఉండడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. దీంతో రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఈ సినిమాలో రజినీ సరసన నయనతార, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.  

Tags:    

Similar News