Rajamouli: అమెరికాలో రెంట్ కి ఇల్లు తీసుకున్న రాజమౌళి

Rajamouli: అమెరికాలో రెంట్ కి ఇల్లు తీసుకున్న రాజమౌళి

Update: 2023-03-15 06:22 GMT

Rajamouli: అమెరికాలో రెంట్ ఇంట్లో రాజమౌళి సెలబ్రేషన్లు..

Rajamouli: "నాటు నాటు" పాట ఆస్కార్ అందుకోవడంతో "ఆర్ఆర్ఆర్" చిత్ర బృందం మొత్తం సెలబ్రేషన్లు మొదలు పెట్టేసింది. చిత్ర డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నాటు నాటు పాట లిరిసిస్ట్ చంద్రబోస్, హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతోపాటు శోభు యార్లగడ్డ, వారాహి సాయి కొర్రపాటి వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పటికే రాజమౌళి చాలా సార్లు అమెరికా వెళ్లి వచ్చారు. కానీ అమెరికా వెళ్ళిన ప్రతిసారి రాజమౌళి ఎక్కడ ఉన్నారు అనే విషయం మాత్రం తెలియలేదు.

తాజా సమాచారం ప్రకారం రాజమౌళి లాస్ ఏంజెల్స్ లో ఒక ఇంటిని రెంట్ కి తీసుకున్నారని అక్కడే ఉన్నారని తెలుస్తోంది. రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా అదే రెంట్ ఇంట్లో ఉన్నారట. రామ్ చరణ్ మరియు ఉపాసన దానికి దగ్గరలోనే ఒక సెవెన్ స్టార్ హోటల్ లో రూమ్ తీసుకున్నారు. అయితే లాస్ ఏంజెల్స్ లో రాజమౌళి కావాలని ఇల్లు రెంట్ కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా కొన్ని ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసులు కూడా రాజమౌళితో కొన్ని సినిమా డిస్కషన్లు జరుపుతున్నాయి. అందుకే వీటికి సంబంధించిన డిస్కషన్ల కోసం వెళ్ళినప్పుడు ఉండటానికి రాజమౌళి అక్కడ రెంట్ కి ఇల్లు తీసుకున్నారట. ఇక ఆస్కార్ వేడుక తర్వాత చిత్ర బృందం మొత్తం ఆ ఇంట్లోనే భారీ ఎత్తున సెలబ్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News