Puri Jagannadh: జనగణమన కి బై బై చెప్పిన పూరి.. నెక్స్ట్ సినిమా అదేనా?
పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా అదేనా?
Puri Jagannadh: జనగణమన కి బై బై చెప్పిన పూరి.. నెక్స్ట్ సినిమా అదేనా?
Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "లైగర్". స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ "జనగణమన" అనే మరొక సినిమాని ప్రకటించారు.
కానీ "లైగర్" సినిమా డిజాస్టర్ అవడంతో "జనగణమన" సినిమాపై అంచనాలు భారీగా తగ్గిపోయాయి. ఇక ఇప్పట్లో "జనగణమన" తీసే ప్లాన్స్ మానుకోవడం మంచిదని అర్దం చేసుకున్న పూరి ఇప్పుడు తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యనే పూరి జగన్నాథ్ కి ఒక కొరియన్ సినిమా చాలా బాగా నచ్చేసింది అంట.
ఆకాష్ పూరి ను హీరోగా పెట్టి ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామని పూరి ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో చాలా వరకు పర బాషా సినిమాలను దర్శక నిర్మాతలు ఫ్రీ మేక్ పేరుతో తెలుగులో కూడా తీసేస్తున్నారు. పూరి కూడా ఇప్పుడు అదే బాటలో తన అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటున్నారట. మరి "లైగర్" సినిమాతో పూరి డిమాండ్ బాగా పడిపోయింది. ఈ రీమేక్ సినిమాతో ఎంతవరకు ఫామ్ లోకి వస్తారో చూడాలి.