Tollywood: పూరీ జగన్నాథ్‌ కూతురు ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఇంతలా మారిపోయిందేంటి..

Pavithra Puri: టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్‌ దర్శకుల్లో పూరీ జగన్నాథ్‌ ఒకరు. తన సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Update: 2025-03-06 11:17 GMT

Pavithra Puri: టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్‌ దర్శకుల్లో పూరీ జగన్నాథ్‌ ఒకరు. తన సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఎంతో మంది హీరోలకు లైఫ్‌ ఇచ్చిన పూరీ జగన్నాథ్‌ ప్రస్తుతం కాస్త గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఇటీవల సరైన విజయం లేక సతమతమవుతున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్‌ పిల్లలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే.

పూరిజగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో నటించిన ఆకాష్‌ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేపోయారు. అయితే పూరి కూతురు పవిత్ర కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బుజ్జిగాడు సినిమా ద్వారా తొలిసారి వెండి తెరకు పరిచమయ్యారు పవిత్ర. ఆ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు పవిత్ర.

అంతకుముందు పలు చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన పవిత్ర బుజ్జిగాడు సినిమా తర్వాత పవిత్ర సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఆకాష్ పూరి వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. పవిత్ర మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే పవిత్ర సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా గోశాలలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే బుజ్జిగాడులో క్యూట్‌గా కనిపించిన పవిత్ర ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది.


Tags:    

Similar News