Priyanka Chopra: లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా... ఎందుకో తెలుసా?

Priyanka Chopra: దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB29. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2025-01-17 06:04 GMT

Priyanka Chopra: లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా... ఎందుకో తెలుసా?

Priyanka Chopra: దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB29. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించనున్నట్టు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పై అధికారిక అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రీసెంట్‌గా హైదరాబాద్‌లో మూవీ టీమ్ పూజా కార్యక్రమం నిర్వహించింది. కానీ పూజకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయట పెట్టలేదు. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరగుతోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో మలేషియన్ హీరోయిన్లు నటించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ చివరికి రాజమౌళి.. ప్రియాంక చోప్రా వైపే మొగ్గు చూపించారు. ఇక జక్కన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానుల్లో ఆసక్తి గా ఎదురు చూస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు సాహస వీరుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. SSMB29 కథ రాయడానికే రెండేళ్లు పట్టిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక స్క్రిప్ట్ వర్క్ కోసం రాజమౌళి ఇన్నేళ్లు ఆగారని అంతా పక్కగా వచ్చాకనే షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆమె ఇప్పటి వరకు ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించారు. తుపాకీ అనే సినిమాలో రామ్ చరణ్ సరసన నటించారు. అయితే అది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మహేష్ సరసన నటిస్తోంది ప్రియాంక. ప్రియాంకతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Tags:    

Similar News