Neeli Neeli Akasam Song : మరో రికార్డు సృష్టించిన 'నీలీ నీలీ ఆకాశం'

Neeli Neeli Akasam Song : బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై మెరుస్తుంటాడు ప్రదీప్‌ మాచిరాజు.. ప్రదీప్‌

Update: 2020-08-16 08:15 GMT
pradeep machiraju's neeli neeli akasam song reach 200 million views in youtube

Neeli Neeli Akasam Song : బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై మెరుస్తుంటాడు ప్రదీప్‌ మాచిరాజు.. ప్రదీప్‌ సినిమాలకి కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌ నటించాడు కూడా.. ముఖ్యంగా 100% లవ్ ప్రదీప్ కి మంచి పేరును తీసుకువచ్చింది. ప్రదీప్‌ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఓ రొమాంటిక్ కామెడీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా ఈ సినిమాలోని 'నీలీ నీలీ ఆకాశం' పాట యూట్యూబ్‌లో ఆదరగోడుతుంది. ఇప్పటికే రికార్డు స్ఠాయిలో వ్యూస్ దక్కించుకున్న ఈ పాట తాజాగా యూట్యూబ్ 200 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఇప్పటివరకూ సౌతిండియాలో ఓ హీరో నటించిన ఓ పాట రిలీజ్ కాకముందు ఈ రికార్డు క్రియేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం.. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత ఆలపించగా అనుబ్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.. ఒక యాంకర్ హీరోగా నటించిన సినిమాలోని పాటకి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అంటే మామలు విషయం కాదు..

ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన ఈ సినిమాకు కథ మాటలు కూడా అందిస్తున్నాడు. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. బాబు సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాని దియేటర్ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Full View

  

Tags:    

Similar News