Prabhas: అభిమానులకి సైతం షాక్ ఇచ్చిన ప్రభాస్

Prabhas: మళ్లీ షూటింగ్ మొదలుపెట్టిన ప్రభాస్

Update: 2022-09-23 11:26 GMT

Prabhas: అభిమానులకి సైతం షాక్ ఇచ్చిన ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". "కే జి ఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు భావించారు. కానీ సడన్ గా రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా మనసికంగా కృంగిపోయారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ కొంత కాలం షూటింగులకు దూరంగా ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ అభిమానులకి షాక్ ఇస్తూ సినిమాలపై తనకి ఉన్న కమిట్మెంట్ తో ప్రభాస్ మళ్ళీ తన సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు. కృష్ణం రాజు చనిపోయిన 11వ రోజున మొయినాబాద్ లో కృష్ణంరాజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన ప్రభాస్ ఇప్పుడు "సలార్" షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో సినిమా షూటింగ్ కోసం కొన్ని భారీ సెట్స్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇక నెల రోజులపాటు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కొనసాగబోతోంది.

Tags:    

Similar News