Prabhas: ఫస్ట్ టైం అలాంటి పాత్రలో నటించనున్న ప్రభాస్

Prabhas: "బాహుబలి" సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ "సాహో" తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.

Update: 2022-01-08 09:30 GMT

Prabhas: ఫస్ట్ టైం అలాంటి పాత్రలో నటించనున్న ప్రభాస్

Prabhas: "బాహుబలి" సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ "సాహో" సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రభాస్ చేతిలో చాలానే బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో "అర్జున్ రెడ్డి" సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రభాస్ కెరీర్ లో 25 సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "స్పిరిట్" అనే టైటిల్ ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

ఈ నేపధ్యంలో ప్రభాస్ "స్పిరిట్ తో నా జర్నీ మొదలు పెడుతున్నాను" అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బహుభాషా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో మాత్రమే కాక కొన్ని ప్యాన్ ఇండియన్ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

తన 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటి దాకా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది లేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన "రాధే శ్యామ్" సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది కానీ ఈ మధ్యనే ఏప్రిల్ కు వాయిదా పడింది.

Tags:    

Similar News