Pawan Kalyan : బుధవారం పవన్‌దే హావా.. బర్త్‌డే అప్‌డేట్స్ టైమింగ్స్ ఇవే!
Pawan Kalyan : అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండేళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ..ఈ సినిమా తర్వాత పవన్
pawan kalyan
Pawan Kalyan : అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండేళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ..ఈ సినిమా తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తరవాత మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు పవన్.. ఇది పవన్ కళ్యాణ్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. అయితే రేపు బుధవారం (సెప్టెంబర్ 02)న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. రేపు ఉదయం 9గం.ల 9 నిమిషాలకి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా ఆఫీషియల్ గా అనౌన్సుమేంట్ ఇచ్చారు నిర్మాతలు దిల్ రాజు, బోనికపూర్..ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది.. దీనితో సినిమా నుంచి టీజర్ ఉంటుందని ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు
ఇక విభిన్న కథ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ తన 27 వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం తెరకెక్కిస్తున్నారు. రిత్రక కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్ ని మధ్యాహ్నం 12.30గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కం టైటిల్ ని అనౌన్సు చేయనున్నారని సమాచారం..
అటు పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది పవన్ కి 28 చిత్రం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని సాయంత్రం 4.05గంటలకు ఇస్తున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారని సమాచారం..అటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం.