ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి కన్నుమూత

Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి అకాల మరణంతో ఇండస్ట్రీలో మరొసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.

Update: 2023-01-27 06:27 GMT

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి కన్నుమూత

Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి అకాల మరణంతో ఇండస్ట్రీలో మరొసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటు కారణంగా శ్రీనివాసమూర్తి చెన్నైలో తన తుది శ్వాసను విడిచారు. ఆయన మరణం తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలను కలచి వేసింది. ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో శ్రీనివాసమూర్తి తన సేవలను అందిస్తూ వచ్చారు. తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎందరో స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో ఆయన చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వల్లనే ఆయన పేరు లైమ్ లైట్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. కానీ ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం సినీ ఇండస్ట్రీకి ఒక తీరని లోటు అని చెప్పవచ్చు.

శ్రీనివాసమూర్తి లాంటి ఒక గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ లేని లోటు ఇండస్ట్రీకి ఎవరు తీర్చలేరేమో. తన పాత్రలకు తగ్గట్టుగా తన గొంతులో కూడా వేరియేషన్ చూపిస్తూ, తన డైలాగ్ డెలివరీతో ఎందరో అభిమానుల మనసులు గెలుచుకున్నారు శ్రీనివాసమూర్తి. అపరిచితుడు లో విక్రమ్, సింగం సిరీస్ లో సూర్య, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు, అల వైకుంఠపురంలో జయరామ్ సుబ్రమణియన్ ఇలా ఎందరో స్టార్ హీరోలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు. ఆయన మృతితో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Tags:    

Similar News