Pooja Hegde: రజనీకాంత్ కూలీలో పూజా హెగ్డే.. అధికారికంగా ప్రకటించిన టీం..

హీరోయిన్ పూజా హెగ్డేకు రజనీకాంత్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇటీవల ఆఫర్లు లేక సతమతమవుతున్న పూజాకు ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఇదే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Update: 2025-02-27 12:09 GMT

రజనీకాంత్ కూలీలో పూజా హెగ్డే.. అధికారికంగా ప్రకటించిన టీం..

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డేకు రజనీకాంత్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇటీవల ఆఫర్లు లేక సతమతమవుతున్న పూజాకు ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఇదే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే భాగం అవుతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి ఇందులో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టాలంటూ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆ పోస్టర్‌లో ఉంది పూజా హెగ్డే అంటూ కన్ఫర్మ్ చేసింది.

కాకపోతే పూజా హెగ్డే కీలక పాత్రలో నటించనున్నారా..? లేదా స్పెషల్ సాంగ్‌లో మాత్రమే కనిపించనున్నారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. జైలర్‌లో హిట్ అయిన కావాలయ్యా పాట తరహాలో అనిరుధ్ ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ పాట కోసమే పూజాను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

పూజా హెగ్డేకు స్పెషల్ సాంగ్స్ కొత్తేమీ కాదు. రంగస్థలంలో ఆమె చేసిన జిగేల్ రాణి సాంగ్ అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అలాగే ఎఫ్3లోనూ ఓ ప్రత్యేక సాంగ్‌ను చేశారు. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్‌తో కలిసి పూజా స్టెప్పులేసేందుకు రెడీ అవుతోంది. పూజా ఈ సినిమాలో భాగం కానున్నట్టు అధికారికంగా మూవీ టీం ప్రకటించింది. కానీ స్పెషల్‌ సాంగ్‌ నా లేక కీలక పాత్రలో నటించనున్నార అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీకాంత్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. 



 


Tags:    

Similar News