Pawan Kalyan: అందుకు గర్వంగా ఉంది.. చిరును ఉద్దేశిస్తూ పవన్ పోస్ట్
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో గౌరవంగా సత్కరించిన విషయం తెలిసిందే.
Pawan Kalyan: అందుకు గర్వంగా ఉంది.. చిరును ఉద్దేశిస్తూ పవన్ పోస్ట్
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో గౌరవంగా సత్కరించిన విషయం తెలిసిందే. సినిమాతో పాటు సేవా రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చిరంజీవికి అభినందనలు తెలియజేశారు.
ఈ విషయమై ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. 'ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా సాదాసీదాగా జీవితాన్ని ప్రారంభించిన మా అన్నయ్య.. తన ప్రతిభ, పట్టుదలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మన్ననలు పొంది మెగాస్టార్‌గా ఎదిగారు. నాలుగు దశాబ్దాలకుపైగా తన కళా ప్రస్థానంతో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన నాకు అన్నయ్య మాత్రమే కాదు, జీవితానికి దారి చూపిన మార్గదర్శి కూడా. నాకు ఏం చేయాలో తెలియని దశలో ఆశ చూపిన వ్యక్తి. ఆయనని తండ్రిలాగా గౌరవంతో చూస్తాను' అని రాసుకొచ్చారు.
తన ప్రతిభతోనే కాకుండా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ, అవసరమైన వారికి నిస్వార్థంగా సహాయపడిన మహానుభావుడంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దేశానికి అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారంతో గౌరవించిందని, తాజాగా యూకే పార్లమెంట్‌లో లభించిన ఈ గౌరవం తమకు ఎంతో సంతోషాన్నించదని అన్నారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని పోస్ట్ చేశారు.