Pawan Kalyan: ఓజీలో అదిరిపోయే ట్విస్ట్‌.. ప‌వ‌న్ కోసం స‌రికొత్త టెక్నాల‌జీ వినియోగం

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెర‌కు కొంత గ్యాప్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2025-04-22 05:37 GMT

Pawan Kalyan: ఓజీలో అదిరిపోయే ట్విస్ట్‌.. ప‌వ‌న్ కోసం స‌రికొత్త టెక్నాల‌జీ వినియోగం

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెర‌కు కొంత గ్యాప్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. చివరిసారి 2023లో ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం రాజకీయాలపై పూర్తిగా స‌మ‌యం కేటాయించిన ప‌వ‌న్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యాన్ని అందుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జ‌న‌సేన భారీ మెజారిటీతో గెల‌వ‌డంతో ప‌వ‌న్ డిప్యూటీ సీఎం అయ్యారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నా ప‌వ‌న్ అభిమానులు మాత్రం ఆయ‌న్ని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో తొలి రిలీజ్ కాబోతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇక అందరిలోనూ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుగుతుండగా, ప్రధాన భాగం ఇప్పటికే పూర్తి అయింది. పవన్ నుంచి మిగిలిన డేట్స్ ల‌భిస్తే చివరి షెడ్యూల్ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తారు. ఈలోగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు జరగుతున్నాయి. దీనికి ఓ నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఓజీ కథలో పవన్ కళ్యాణ్ ఓ శక్తివంతమైన డాన్ పాత్రలో కనపడనున్నారు. పదేళ్ల అజ్ఞాతంలో గడిపిన తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిన ఓజస్ గంభీరా పాత్రలో కనిపిస్తారు. కథలో కీలకమైన మరో డాన్‌ను అంతమొందించడం, ఇతర గ్యాంగ్స్‌ను క్లీన్ చేయడం వంటి సీన్స్‌తో సినిమా నడుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్‌ మూడు వేర్వేరు కాలాలకు చెందిన లుక్స్‌లో కనిపించనున్నారు. అందులో ఓసారి 30 ఏళ్ల యువకుడిలా కూడా కనిపించబోతున్నారట. ఇందుకోసం ప్ర‌త్యేక టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News