PSPK 27 First Look : క్రిష్ సినిమాలో పవర్ స్టార్.. ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా!

PSPK 27 First లుక్ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా..

Update: 2020-09-02 13:02 GMT

PSPK 27 First లుక్ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా.. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి.. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగారు పవన్.. నేడు పవన్ కళ్యాణ్ తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..

పవర్ స్ట్రార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 27వ సినిమా ప్రీలుక్ విడుదలైంది. చిత్ర యూనిట్ ప్రీలక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేయగా, టైటిల్ ను మాత్రం ప్రకటించలేదు. త్వరలో సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ ప్రీలుక్ కు గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ నుండి విపరీతమైన స్పందన వస్తుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎఎం రత్నం నిర్మిస్తున్నారు. ''పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు''. అంటూ దర్శకుడు క్రిష్ ట్వీట్ చేసాడు. అయితే, పవన్ లుక్ చూస్తుంటే క్రిష్ మరోసారి పీరియాడిక్ కథాంశంతో పవన్ కళ్యాణ్‌ని యుద్ధ వీరుడిగా చూపించబోతున్నట్టే కనిపిస్తోంది.



అయితే, పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన రీఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ నుకుడా నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.. విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. మోషన్ పోస్టర్ లో లాయర్ గా పవన్ లుక్ కూడా ఆదరిపోయింది..

ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్యపాత్రాలు పోషిస్తున్నరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.. హిందీలో అమితాబ్ బచ్చన్న టించిన పింక్ సినిమాకి ఇది రీమేక్.. ఇక ఈ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి మరో రెండు సినిమాలు చేసేందుకు సిద్దం అయిన సంగతి తెలిసిందే.. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.


Tags:    

Similar News