మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్
అమృతాప్రణయ్ తండ్రి మారుతీరావు శనివారం ఆర్థరాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యా భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
అమృతాప్రణయ్ తండ్రి మారుతీరావు శనివారం ఆర్థరాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యా భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో మిర్యాలగూడలో అమృత భర్త ప్రణయ్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ హత్యతో ప్రధాన నిందితుడిగా మారుతీరావు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై 'పలాస 1978' చిత్ర దర్శకుడు కరుణ కుమార్ స్పందించారు. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని అందమైన జీవితం ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అమ్మాయి గర్భందాలిస్తే చెకప్ కోసం ఆస్పత్రికి ఆమె భర్తతో కలిసి వెళ్తుండగా రోడ్డుపై నరికేశారు.
ఈ ఘటన జరిగేముందు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తారు. భర్త మరణంతో వారి కలలన్ని ఆవిరైపోతాయి. దీనికి కారణం కులం. తిరిగి ఏడాది తర్వాత ఆ అమ్మయి తండ్రి చనిపోయాడు. ఆ అబ్బాయి మంచి వాడు కాకపోతే బిడ్డకు నచ్చజెప్పినా ఒక అర్థం ఉంటుంది. తక్కువ కులానికి చెందినవాడు అని చంపేయడం సబాబేనా? మారుతీరావు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా?. ప్రణయ్ తమ కులానికి మచ్చ తెచ్చాడని, ఆ కులానికి చెందివాళ్లు మారుతీరావు విగ్రహం పెట్టిన ఆశ్చర్యంలేదు.
'పలాస 1978' ఈ సినిమాలో కూడా ఎవరి కులాన్ని కూడా ఎక్కవ, తక్కువ చేసి చూపించలేదు. అందరినీ సమానంగానే చూపించాంమని కురణ కుమార్ అన్నారు. రక్షిత్, నక్షత్ర మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, ధయాన్ అట్లూరి సినిమాని నిర్మించారు. ఈ సినిమా మార్చ 6న విడుదలైంది. ఈ సినిమాలో కథ కులాల మధ్య సాగుతోంది.