Sonu Sood Welding Work Shop: పొందిన సహాయానికి కృతజ్ఞత చూపించాడు!

Sonu Sood Welding Work Shop: కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది.

Update: 2020-07-19 12:39 GMT
sonu sood

Work Shop with Sonu Sood Name: కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. పొట్టకూటి కోసం వివిధ నగరాలకి వెళ్ళిన వలస కూలీలు అక్కడే చిక్కుకపోయారు. రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడికి స్థభించిపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో వారు కాలి నడకన వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు చేరుకున్నారు.. ఇది చూసి చలించిపోయిన నటుడు సోనూ సూద్ వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. తన సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి వారిని తమ ఇంటికి చేర్చాడు. 

అందులో భాగంగా సోనుసూద్ సహాయం పొందిన వలస కూలీలలో కేంద్రపర జిల్లాలోని చించిరి గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ ప్రధాన్ కూడా ఒకడు.. ఈ 32 ఏళ్ల వ్యక్తి కొచ్చిలో ప్లంబర్‌గా పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం పోవడంతో తన సొంత గ్రామానికి వచ్చి పలు చోట్లలో ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడ కూడా దొరకకపోవడంతో తానే సొంతంగా వెల్డింగ్ వర్క్ షాప్ పెట్టాడు. అయితే ఈ షాపుకి సోనుసూద్ పైన ఉన్న కృతజ్ఞతతో ఆయన పేరు పెట్టుకున్నాడు.

ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. " నేను కొచ్చి ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఓ కంపెనీలో ప్లంబర్‌గా పనిచేసేవాడిని. లాక్ డౌన్ కారణంతో నేను అక్కడే చిక్కుకుపోయాను. అప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేకపోయారు. నా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. ఆ సమయంలో నా జీవితంలోకి సోనూ సూద్ దేవుడి లాగా వచ్చారు నాతో పాటుగా ఇంకా చాలామందిని ప్రత్యేక విమానంలో ఒడిశాకు పంపించారు" అని వెల్లడించాడు.

టాలీవుడ్ లో టాప్ విలన్!

ఇక టాలీవుడ్ లో సోనూసూద్ టాప్ విలన్ లలో ఒకరు.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ఆ తర్వాత ఆంజనేయులు, దూకుడు, ఆగడు, అరుంధతి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

Tags:    

Similar News