Nayanthara: ప్లీజ్‌ నన్ను అలా పిలవకండి.. అభిమానులకు విజ్ఞప్తి చేసిన నయనతార

హీరోలతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో నటి నయనతార ఒకరు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ చెరగని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ.

Update: 2025-03-05 06:07 GMT

ప్లీజ్‌ నన్ను అలా పిలవకండి.. అభిమానులకు విజ్ఞప్తి చేసిన నయనతార 

Nayanthara: హీరోలతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో నటి నయనతార ఒకరు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ చెరగని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా కూడా నయన్‌ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నయనతారను లేడీ సూపర్‌ స్టార్‌గా పిలుస్తారనే విషయం తెలిఇసందే. అయితే తాజాగా దీనిపై నయనతార కీలక వ్యాఖ్యలు చేసింది.

అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తాను "లేడీ సూపర్‌స్టార్‌" అనే బిరుదుతో పిలిపించుకోవాలని కోరడం లేదని, నయనతార అనే పేరు తనకు ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ విషయమై ఆమె పోస్ట్‌ చేస్తూ.. 'మీ అందరి ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా జీవితం ఓ తెరిచిన పుస్తకం. నా విజయాల్లో, కష్టకాలాల్లో మీరు నన్ను అండగా నిలబెట్టారు. "లేడీ సూపర్‌స్టార్‌" అనే బిరుదును ఎంతో ప్రేమగా ఇచ్చారు. కానీ, నయనతార అనే పేరు నాకు మరింత సాన్నిహిత్యంగా అనిపిస్తుంది. ఇలాంటి బిరుదులు గొప్పవి, కానీ అవి కొన్నిసార్లు నాకు కంఫర్ట్‌గా అనిపించవు. సినిమా మనందరినీ కలిపే మాధ్యమం. అందుకే, ఆ గొప్పతనాన్ని కలిసికట్టుగా సెలబ్రేట్‌ చేసుకుందాం' అని రాసుకొచ్చారు.

సినిమాల విషయానికొస్తే నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ బ్యూటీ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. అయితే నయనతార తెలుగులో మాత్రం నటించడం లేదు. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో బిజీగా ఉంది. టాక్సిస్‌ ఈ ఫెయిర్‌ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అనే ఇంగ్లిష్‌ సినిమాలో కూడా నటిస్తోందీ చిన్నది. 


Tags:    

Similar News