Namrata Shirodkar: నమ్రతా లేటెస్ట్‌ ఫొటోషూట్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు

Namrata Shirodkar: మాజీ మిస్ ఇండియా, సినీ నటి నమ్రతా శిరోద్కర్ సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

Update: 2025-03-16 08:03 GMT

Namrata Shirodkar: నమ్రతా లేటెస్ట్‌ ఫొటోషూట్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు

Namrata Shirodkar: మాజీ మిస్ ఇండియా, సినీ నటి నమ్రతా శిరోద్కర్ సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన నమ్రత.. సూపర్ స్టార్ మహేశ్ బాబును పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కానీ.. సినిమా నుంచి దూరమైనా, ఫ్యాషన్ పరంగా మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది.

తాజాగా నమ్రతా శిరోద్కర్ చేసిన స్పెషల్ ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లాంగ్ డ్రెస్‌లో తళుక్కుమంది. అంతేకాదు.. సిద్దార్థ్ జ్యూవెలరీస్‌కు చెందిన ఆభరణాలను ధరించి ఫోటోలకి స్టన్నింగ్‌గా పోజులిచ్చింది. ప్రముఖ జ్యూవెలరీ డిజైనర్ నాగిని ప్రాసాద్ డిజైన్ చేసిన ప్రత్యేక ఆభరణాలు ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి.

ఈ లేటెస్ట్ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు కామెంట్స్ చేస్తూ “ఇంకోసారి మహేశ్ బాబుతో స్క్రీన్ షేర్ చేస్తే బాగుంటుంది”, “నమ్రత మిస్ ఇండియా కాదు.. మిస్ ఎలెగెన్స్” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఫ్యాషన్, గ్రేస్‌, ఎలెగెన్స్‌ అన్నీ కలిపి చూపించాలంటే.. నమ్రత లేటెస్ట్ లుక్‌ పక్కా ఉదాహరణ అని చెప్పొచ్చు. మొత్తం మీద చాలా రోజుల తర్వాత నమ్రతా మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది.

Tags:    

Similar News