ఉద్వేగభరిత పోస్ట్‌ పెట్టిన నమ్రతా

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు సతీమణి, నిర్మాత నమ్రతా శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టారు.

Update: 2020-01-05 13:59 GMT
Namrata, mahesh , Gowtham

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు సతీమణి, నిర్మాత నమ్రతా శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టారు. అది చూసిన నెటిజన్లకు ఆ పోస్టు అమితంగా ఆకట్టుకుంటోంది. నమ్రతా శిరోద్కర్‌ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పోస్టుతో పాటు ఉద్వేగభరితమైన ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇంతకీ నమ్రతా శిరోద్కర్‌ పెట్టిన ఫోటోలో ఏముందంటే సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు‌, గౌతమ్‌ కృష్ణ ఒకే విధంగా ఉన్నారు. ముగ్గురు ఒకే రకమైన దుస్తువులు ధరించి ఉండడం విశేషం. నమ్రతా పెట్టిన పోస్టు అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా నమ్రతా ఫోటో తోపాటు క్యాప్షన్ కూడా పెట్టారు. వీరే నా సూపర్‌ హీరోలు, వీరే నా బలం అంటూ ఓ కామెంట్ కూడా పెట్టారు. నాపై చూపిస్తున్న ప్రేమకు నేను ఎప్పటికీ ధన్యురాలినే, ఈ ముగ్గురు నాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పారు అందుకు నేను ఆనందంగా ఉన్నా..అంటూ నమ్రతా హృదయాలకు హత్తుకునేలా కామెంట్ పెట్టారు.

మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయకగా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాని సంక్రాంతికి కానుకగా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబులు కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5 ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

ఆదివారం రాత్రి 9.09ని.ల‌కి స‌రిలేరు నీకెవ్వరు చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో ఆర్మీ మేజ‌ర్ పాత్రలో మ‌హేష్ క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గచ్చిబౌలి స్టేడియం వద్ద మహేష్ అభిమానులతో పాటు మెగా అభిమానులతో కోలాహలంతో నిండిపోయింది. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, సంగీత, రఘుబాబు, జయప్రకాష్‌ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిచారు. సినిమా విడుదలకి దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచేసింది.


 

Tags:    

Similar News