Wild Dog: 'వైల్డ్ డాగ్' డే 1 కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే

Wild Dog: నాగార్జున 'గగనం' చిత్రం గతంలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2021-04-03 09:19 GMT

నాగార్జున వైల్డ్ డాగ్ ( ఫైల్ ఫోటో )

Wild Dog: కింగ్ నాగార్జున ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడం కొత్తమేకాదు. ఆయన కొత్తగా ట్రై చేసిన 'గగనం' చిత్రం గతంలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే తాజాగా నాగ్ హీరోగా వైవిద్యభరిత పాత్రలో రూపొందిన చిత్రం 'వైల్డ్ డాగ్'. కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మోన్ ఈ మూవీకి ద‌ర్శక‌త్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (ఏప్రిల్ 2) విడుదల అయిన సంగతి తెలిసిందే. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని తెలుస్తోంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దియా మీర్జా కీలక పాత్రలో నటించారు.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున కనిపించారు. ఈ పాత్రకు నాగార్జునే కరెక్ట్ అనిపించేటంత గొప్పగా నటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 8.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'వైల్డ్ డాగ్' సినిమాకు ఫస్ట్ డే రెస్పాన్స్ బాగానే వచ్చింది. తొలి రోజుకు గాను ఈ మూవీ 1.33 షేర్, 2.60 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటం ఈ సినిమా కలెక్షన్స్‌పై కాస్త ప్రభావం చూపెట్టిందని తెలుస్తోంది. 9 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 8 కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తే బయటపడుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి 1.21 కోట్ల షేర్, 2.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఏరియా వారిగా ఈ సినిమా కలెక్షన్లు చూస్తే:

నైజాం- 53 లక్షలు

సీడెడ్‌- 19 లక్షలు

ఉత్తరాంధ్ర- 16 లక్షలు

ఈస్ట్‌ గోదావరి- 7 లక్షలు

వెస్ట్‌ గోదావరి- 6 లక్షలు

గుంటూరు- 7 లక్షలు

కృష్ణా- 8 లక్షలు

నెల్లూరు- 5 లక్షలు

ఆర్ఓఏ- 6 లక్షలు

ఓవర్సీస్- 6 లక్షలు

Tags:    

Similar News