Tollywood: మిస్ ఇండియాతో జోడీ కడుతున్న నాగార్జున..

* పాతికేళ్ల అమ్మాయితో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో

Update: 2023-02-23 15:00 GMT

నాగార్జున సినిమాలో నటించిన మిస్ ఇండియా

Nagarjuna: గత కొంతకాలంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే విడుదలైన "ది గోస్ట్" సినిమా మంచి రివ్యూలు అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నాగార్జున కెరియర్ లో మరొకటి డిజాస్టర్ గా నిలిచింది. నాగార్జున ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఒక పక్క కమర్షియల్ సినిమా లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే నాగర్జున ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్ లో ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ కూడా పాల్గొంది అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మిస్ ఇండియా విజేత మానస వారణాసి. గత కొంతకాలంగా తెలుగులో మంచి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మానస ఇప్పుడు నాగార్జున సరసన హీరోయిన్ గా నటించడానికి రెడీ అయింది. ఈ సినిమా విషయంలో మానస చాలా ఎగ్జైటెడ్ గా ఉందని, షూటింగ్ మొదలు పెట్టాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందని తెలుస్తోంది.

గతంలో నాగార్జున వయసులో సగం కూడా ఉండని రకుల్ ప్రీత్ తో నటించినప్పుడు నెటిజన్లు నాగార్జున పై మండిపడ్డ సంగతి తెలిసిందే. మళ్లీ నాగర్జున ఇప్పుడు కనీసం 30 ఏళ్లు కూడా లేని మానస వారణాసి తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుండడంతో అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News