Nagarjuna started shooting : బిగ్ బాస్ 4 యాడ్ షూటింగ్ లో నాగార్జున!

కరోనా వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే మెల్లిమెల్లిగా మళ్ళీ ఆగిపోయిన షూటింగ్ లు, కొత్త సినిమాలు

Update: 2020-07-31 14:58 GMT
Nagarjuna (File photo)

Nagarjuna started shooting : కరోనా వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే మెల్లిమెల్లిగా మళ్ళీ ఆగిపోయిన షూటింగ్ లు, కొత్త సినిమాలు, షోలు పట్టాలేక్కుతున్నాయి. అందులో భాగంగానే కింగ్ నాగార్జున షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ సెట్ లో బిగ్ బాస్ 4 యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు అయన. దీనికి సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ యాడ్ కి ప్రముఖ కెమెరామన్ కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెలువడనున్నాయి.



అయితే నాగార్జున ఈ యాడ్ షూటింగ్ లో పాల్గొనడంతో ఈ సారి సీజన్ కి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారట.. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక అటు కరోనా వలన ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఉంటుందా లేదా అని సందేహపడుతున్న అభిమానులకి స్టార్ మా ఆఫీషియల్ గా బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం కంటెస్టెంట్ లను ఎంపిక చేసే పనిలో ఉంది. చూస్తుంటే మరో రెండు మూడు వారాలలో షో మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక అటు నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాగ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా అయన తాజాగా గరుడవేగ ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తగా నిర్మించనున్నాయి. 

Tags:    

Similar News