ఆ సినిమాని రీమేక్ చేయాలని ఉంది అంటున్న మహేష్ బాబు మేనల్లుడు

ఆ సినిమాని రీమేక్ చేయాలని ఉంది అంటున్న మహేష్ బాబు మేనల్లుడు

Update: 2022-04-04 15:00 GMT

Ashok Galla: ‘మురారి’ రీమేక్ చేయాలని ఉంది!

Ashok Galla: ప్రముఖ రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా తనయుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా "హీరో" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే బాగానే నటించిన అశోక్ ఇప్పుడు తన రెండవ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అశోక్. మహేష్ బాబు సినిమా లో ఏదైనా సినిమాని రీమేక్ చేయాలి అనుకుంటే ఏ సినిమాని రీమేక్ చేస్తారు అని అడగగా అశోక్ వెంటనే "మురారి" సినిమాని రీమేక్ చేస్తానని అన్నారు.

"మహేష్ బాబు గారు ఆ సినిమాలో చాలా గొప్పగా నటించారు అంత అద్భుతమైన కథ మళ్ళీ రాకపోవచ్చు కానీ నిజంగా రీమేక్ చేసే అవకాశం వస్తే మురారి సినిమాని రీమేక్ చేస్తాను" అని అన్నారు అశోక్. ఇక తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ తనింకా ఏ కథను ఫైనల్ చేయలేదని ప్రస్తుతం అదే కన్ఫ్యూజన్ లో ఉన్నానని అన్నారు. "ప్రస్తుతానికి రెండు కధలు ఉన్నాయి. జూన్ లోపు ఏదో ఒక కథను ఫైనల్ చేసి షూటింగ్ మొదలు పెడతాము" అని క్లారిటీ ఇచ్చారు అశోక్.

Tags:    

Similar News