Mohan Babu: మోహన్‌ బాబు బర్త్‌డే స్పెషల్‌.. కన్నప్ప లేటెస్ట్‌ అప్‌డేట్‌ చూశారా.?

Mohan Babu: భారీ బడ్జెట్‌తో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు.

Update: 2025-03-20 07:59 GMT

Mohan Babu: భారీ బడ్జెట్‌తో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. టీజర్‌పై కాస్త నెగిటివ్‌ టాక్ వచ్చినా ఆ తర్వాత క్రమంగా పాజిటివిటీ పెరిగింది.

ముఖ్యంగా ఇటీవల విడుదలైన మరో టీజర్, పాటలు అభిమానులను ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే గురువారం మోహన్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన 'మహాదేవ శాస్త్రి'గా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. 'ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ... ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ...' అనే లిరికల్ సాంగ్‌తో రూపొందించిన ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కన్నప్ప’ చిత్రాన్ని టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్లు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భక్తి, ఆధ్యాత్మికత, సాహసాన్ని మేళవించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇన్ని అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

Full View


Tags:    

Similar News