చిన్న బ్రేక్ ఇస్తున్నాను.. తర్వాత బొమ్మ దద్దరిళ్లిపోద్ది.. ట్రైలర్ రిలీజ్

మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స‌రిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయకగా నటించింది.

Update: 2020-01-05 17:34 GMT

మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స‌రిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయకగా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాని సంక్రాంతికి కానుకగా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబులు కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5 ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ రాత్రి 9.09 గంటలకు విడుదల చేశారు.

అయితే తాజా విడుదలైన ట్రైలర్ దద్దరిళ్లిపోయింది. మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీని ఈ సినిమాలో చూపించారు. మహేశ్ బాబుతో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చివర్లో మహేష్ చెప్పే డైలాగ్ హైలెట్ అని చెప్పాలి. ట్రైలర్ చివర్లో "చిన్న బ్రేక్ ఇస్తు్న్నాను.. తర్వాత బొమ్మ దద్దరిళ్లిపోద్ది" అని మహేశ్ బాబు ఫుల్ ఎనర్జీతో చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. 

కొండారెడ్డి బుర్జు వద్ద తీసిన యాక్షన్ సీన్స్ బాగున్నాయి. 'దూకుడు' తర్వాత మహేష్ బాబు సినిమాలో చూడని కామెడీ సన్నీవేశాలు ఇందులో ఉన్నాయి. ట్రైలర్ చూస్తే పక్కా హాస్యభరిత చిత్రమని అర్ధమవుతుంది. రాజాదిగ్రేట్ , ఎఫ్2 లో ఉన్న మాదిరిగా ఓ ఫన్నీ డైలాగ్ అందరితో చెప్పించడం మరింత కామెడీ పండింది. ఇక విజయశాంతి మహేశ్ బాబు మధ్య సీన్స్ ఈ ట్రైలర్ లో పూర్తి స్థాయిలో చూపించలేదు. కేవలం విలన్ ఇంటి వద్ద జరిగే సీన్ మాత్రమే చూపించారు. "చూట్టు వంద మంది మధ్యలో ఒక్కడు టచ్ చేయండి" అంటూ విజయశాంతి చేప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. ఇంకో కొన్ని డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఉన్నాయి. 

Full View


 

Tags:    

Similar News