సినీ పరిశ్రమ సమస్యలపై ఇవాళ కీలక సమావేశం
Tollywood Meeting: ఉదయం 11గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో సమావేశం, సమావేశానికి దాదాపు 240 మందికి ఆహ్వానం.
సినీ పరిశ్రమ సమస్యలపై ఇవాళ కీలక సమావేశం
Tollywood Meeting: సినీ పరిశ్రమ సమస్యలపై ఇవాళ కీలక సమావేశం జరుగనుంది. టికెట్ల సమస్య పరిష్కారానికి ముందడుగు పడింది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్, మంత్రి పేర్నినాని పలు మార్లు సినీ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, ఈ వ్యవహారంలో ఇవాళ టాలీవుడ్ ప్రముఖుల సమావేశం కాబోతున్నారు.. ఉదయం 11గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో సమావేశం జరగనుంది.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడంతో ఆసక్తికరంగా మారింది..
ఇవాళ హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు పాల్గొననున్నారు. దాదాపు 240 మందిని ఈ సమావేశం కోసం ఆహ్వానించింది ఫిల్మ్ ఛాంబర్. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సారధ్యంలో జరిగే ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి వేళ సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటంకాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.