Meena: సౌందర్యతో పాటు నేనూ వెళ్లాల్సింది..
Meena: దివంగత నటి సౌందర్య ఫ్లైట్ ప్రమాదంపై తాజాగా సీనియర్ నటి మీనా ఎమోషనల్ అయ్యారు.
Meena: దివంగత నటి సౌందర్య ఫ్లైట్ ప్రమాదంపై తాజాగా సీనియర్ నటి మీనా ఎమోషనల్ అయ్యారు. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోకు అతిథిగా వచ్చిన మీనా, తన వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సౌందర్యతో అనుబంధం..
సౌందర్య మరణించిన ఫ్లైట్ ప్రమాదం గురించి మాట్లాడుతూ, ఆరోజు తాను కూడా సౌందర్యతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉందని మీనా తెలిపారు. కానీ షూటింగ్ కారణంగా తాను వెళ్లలేకపోయాను. "ఆ ఫ్లైట్‌కు అలా జరిగిందని తెలుసుకుని చాలా బాధపడ్డాను. నేను వెళ్లలేనందుకు సంతోషపడ్డాను, కానీ సౌందర్య వెళ్లిందని తెలుసుకుని చాలా బాధపడ్డాను" అంటూ మీనా కన్నీళ్లు పెట్టుకున్నారు.
వ్యక్తిగత కష్టాలు, పోరాటం..
తన భర్త మరణం గురించి మాట్లాడుతూ, ఆ సంఘటనను తాను అస్సలు ఊహించలేదని మీనా అన్నారు. "అనుకోకుండా అలా జరిగిపోయేసరికి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కానీ మంచి ప్రయత్నం ఎప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తుందనే నమ్మకం నాకు ఉంది. అదే నమ్మకం నన్ను మళ్ళీ సినిమాల్లో రాణించేలా చేస్తోంది" అని ఆమె తెలిపారు.
సినీ ప్రస్థానం..
'దృశ్యం' సినిమా గురించి మాట్లాడుతూ, తన కూతురు పుట్టిన రెండేళ్ల తర్వాత మలయాళంలో ఆ సినిమాను తనను దృష్టిలో పెట్టుకునే రాశారని, వేరే వారితో చేయలేమని చెప్పడంతో చివరకు నేనే చేయాల్సి వచ్చిందని మీనా గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు ఉన్నాయని, సినిమాల్లో అవకాశాలు కూడా అలాగే వచ్చాయని ఆమె చెప్పారు.